//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోలీస్ అనే వాళ్లందరికీ ఆయనే స్ఫూర్తి..

Category : editorial

ఇది హైదరాబాద్ లోని అమీర్ పేట ఎస్.ఆర్ నగర్ సర్కిల్ లోని ఒక విగ్రహం. కొత్తగా దిగిన వారికి అదెవెరిదో తెలియకపోవచ్చు. కొంతమంది ఆయన ఎవరో కూడా తెలియకపోవచ్చు. ఆయనే "చదలవాడ ఉమేష్ చంద్ర". ఉమేష్ చంద్ర గారు గుంటూరు జిల్లా, పెదపాడులో మార్చి 29 , 1966 లో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యాబ్యాసం పూర్తిచేసుకున్న అయన, తరువాత నిజాం కాలేజ్ లో BA గ్రాడ్యుయేషన్ మరియు ఒస్మానియా యూనివర్సిటీ నుడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ( MA ఎకనామిక్స్ ) లో పట్టా పొందాడు.

1991 లో IPS ఆఫీసర్ గా శిక్షణ పొందారు. 1992 నుండి 1994 వరకు వరంగల్ లో ASP గా విధులు నిర్యహించారు.ఆ తరువాత మూడు నెలలు అనగా 1 నవంబర్ 1994 నుండి 2 ఫిబ్రవరి 1995 పులివెందులలో పనిచేసారు. అనతికాలంలోనే పోలీస్ అంటే ఇలా ఉండాలని నిరూపించాడు. ఉమేష్ చంద్ర అనే పేరు వింటే చాలు కొంత మంది రాజకీయ నాయకులు, సంఘ విద్రోహా శక్తులకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. పోలీస్ అంటే ఎలా ఉండాలో ఇప్పటికీ ఆ శాఖలో ఆయన పాఠాలే మార్గదర్శకం. అప్పటివరకు ప్రజలలో పోలీసులపై ఉన్న చెడు అభిప్రాయాన్ని దూరం చేసాడు ఉమేష్ చంద్ర.

అయన సిన్సియారిటీ గుర్తించిన అప్పటి ప్రభుత్యం SP గా ప్రమోషన్ ఇచ్చింది. ఆ తరువాత జూన్ 1995 నుండి జూన్ 1997 వరకు కడపలో మరియు జూన్ 1997 నుండి ఏప్రిల్ 1998 వరకు కరీంనగర్ లో SP గా విధులు నిర్యహించారు.తరువాత తరువాత ప్రమోషన్ రావడంతో A.I.G (స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్) గా నవంబర్ 1998 నుండి సెప్టెంబర్ 1999 వరకు విధులు నిర్వహించారు.

అయన పదవి కాలంలో ఎంతో మంది సంఘ విద్రోహా శక్తులను, తప్పు చేసిన రాజకీయ నాయకులను, నక్సలైట్ ల హడలెత్తించాడు. అలాంటి ఆయన్ను ఎదుర్కోనే దైర్యం లేక కొంత మంది దుర్మార్గులు అయన మార్నింగ్ వాక్ వచ్చిన సమయలో కాల్చి చెప్పారు. ఆ తరువాత ఎస్ ఆర్ నగర్ సమీపంలో అయన మరణించిన చోటే అయన విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఈ రోజు అయన వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ...ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలని కురుకుంటున్నాము.