//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్ర మంత్రి ఉమా భారతికి అస్వస్థత ! : ఆసుపత్రికి తరలింపు

Category : national

కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆల్ ఇండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

గతకొన్నేళ్లుగా మోకాలి నొప్పితో బాధ పడుతున్న ఆమె శుక్రవారం రాత్రి నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఎయిమ్స్‌లో చేరినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలోని కొత్త ప్రైవేట్ వార్డులో మంత్రి ఉమాభారతి మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అవసరమని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.