//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రైవేటు వర్శిటీలకి భారీ షాక్

Category : national

దేశ వ్యాప్తంగా 123 విద్యా సంస్థలకు వర్శిటీ హోదాను రద్దు చేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) ఉత్తర్వులు జారీ చేసింది. UGC ఉత్తర్వులు ప్రకారం లిస్టులో తెలిపిన కాలేజీలు విద్యా సంస్థల పేరు చివర యూనివర్సిటీ పదం ఉంచరాదని ఆదేశించింది.

దీంతో పాటు సుప్రీం కోర్టు ఆదేశంతో దూరవిద్య విధానం ద్వారా నాలుగు విద్యా సంస్థలు జారీ చేసిన ఇంజనీరింగ్‌ పట్టాలను కూడా రద్దు చేసింది. కొత్త పేరు కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని UGC ఆదేశించింది. యూజీసీ ప్రకటించిన 123 విద్యాసంస్థల లిస్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదు విద్యాసంస్థలు ఉన్నాయి.

అయితే, విద్యా సంస్థ‌లు అన్నీ య‌థావిధిగా ప‌నిచేయ‌వ‌చ్చు. కానీ, హోదా కోల్పోయిన‌ విద్యాసంస్థ‌ల పేరు చివ‌ర యూనివ‌ర్సిటీ అన్న పదం ఉండ‌కూడ‌దు. ఆయా విద్యా సంస్థ‌లు ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాల ప‌రిధిలో ప‌నిచేయాలి, అంటే ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాల అనుబంధంగా న‌డ‌పాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుస‌రిస్తూ దూరవిద్య విధానం ద్వారా 4 విద్యాసంస్థ‌లు జారీ చేసిన ఇంజ‌నీరింగ్ ప‌ట్టాలు ర‌ద్దు అయ్యాయి.

…గాంధీ ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతంవర్శిటీ)-విశాఖపట్నం

…కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (కేఎల్‌ వర్శిటీ)-గుంటూరు

…విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌(విట్‌)- గుంటూరు

…రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం-తిరుపతి

…శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌-అనంతపురం

....ఎస్‌.ఆర్‌.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ