//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Telugu anchor udaya bhanu : తెలుగు యాంకర్ ఉదయ భాను : udaya bhanu husband marriage bio data

Category : editorial

యాంకర్ ఉదయ భాను అనగానే మనకి గుర్తొచ్చే అందమయిన పొడవాటి చక్కని తెలుగు ఇంటి అమ్మాయి.ఉదయభాను ప్రముఖ టెలివిజన్ యాంకర్ మరియు నటి.ఆగస్టు 5, 1980 లో కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ జన్మించింది.

పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ఆ షో ప్రధాన ఉద్దేశం. ఆమెకు అప్పటికి యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది.

ఆమె తండ్రి డాక్టర్, తల్లి ఆయుర్వేద వైద్యురాలు. ఆమెకు సాప్ట్‌వేర్ జాబ్ చేసే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆమె తండ్రి ఒక కవి. ఆయన కలంపేరు ఉదయభాను. దానినే కూతురుకు పెట్టాడు. ఆయన ఉదయభానుకు నాలుగేళ్ళ వయసులో చనిపోయారు.

ఆయన చనిపోయాక తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొంది. అతడికి ఏడుగురు సంతానం. ఆమె 15 వ ఏట ఒక ముస్లీంతో వివాహం జరిగింది. ఆమెకు ఇష్టం లేకపోవటం వలన విడాకుల అనంతరం విజయకుమార్ అనే అతడిని తల్లి అనుమతికి వ్యతిరేకంగా వివాహం చేసుకొన్నది. భాను ఎం.ఏ వరకూ చదివింది.ఇప్పుడు ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది.

10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది , తరువాత కొన్ని తమిళ, కన్నడ సినిమాలో నటించింది.ఆ తరువాత ఐటెం సాంగ్స్ తోను బుల్లి తెర మీద యాంకర్ గాను మంచిగానే సెటిల్ అయ్యింది.

ఉదయభాను కి మంచి కెరీర్ ఇచ్చింది మాత్రం etv లో ప్రసారం అయ్యే హార్లిక్స్ హృదయాంజలి ప్రోగ్రామే ఆ తరువాత జెమినీ టీవీ లో ప్రసారం అయ్యే సాహసం చేయరా డింబక మరియు ఒన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్స్. తాజా గా ఉదయభాను ఐటమ్స్ సాంగ్స్ లో లీడర్ మరియు జులాయి మూవీస్ లో చేసింది .

Related News