//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉబర్ సీఈఓ ట్రావిస్ కలనిక్ రాజీనామా

Category : business

ప్రముఖ క్యాబ్ సర్వీసు సంస్థ ఉబర్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలనిక్ తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ట్రావిస్ రాజీనామా చేయాలంటూ ఉబర్ ఇన్వెస్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఉబర్ సంస్థ ఇంకా అధికారకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ట్రావిస్ తన తల్లి మృతిచెందడంతో లీవ్‌లో ఉన్నారు. కాగా, గత కొంతకాలంగా ట్రావిస్‌పై ఇన్వెస్టర్లు వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రావిస్ వెంటనే రాజీనామా చేయాలంటూ సంస్థకు చెందిన కొందరు ప్రధాన ఇన్వెస్టర్లు డిమాండ్ చేయడంతో ట్రావిస్ రాజీనామా చేసినట్లు సమాచారం.