//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ పెన్ డ్రైవ్స్ - అసలు కధేంటంటే ?

Category : editorial

నిన్నటి నుండి ట్విట్టర్ లో ఒక విషయం ట్రేండింగ్ లోకి వెళ్ళింది అదేందంటే రెండు పెన్ డ్రైవ్స్, ఈ రెండు పెన్ డ్రైవ్స్ లో విషయం ఏముందో తెలియదు.

కాని రెండు పెన్ డ్రైవ్స్ మీద నెటిజన్లు అనేక విధాలుగా జోకులేస్తున్నారు. అసలు ఈ పెన్ డ్రైవ్ లేంటి..? రెండు తెలుగు రాష్ట్రాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడిగితే మాత్రం ఏ ఒక్కరు చెప్పట్లేదు. కాని లోతుగా పరిశీలిస్తే ఈ పెన్ డ్రైవ్ వ్యవహరం మొత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది.

ఇంతకీ ఈ రెండు పెన్ డ్రైవ్ ల కథేంటి..? దానికి జనసేనాదినేతకు ఉన్న లింకేంటని చాలా మంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారంటే ఈ విషయం మీద నెటిజన్లు ఎంత క్యూరియాసిటీ తో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు, అయితే తాజాగా సోషల్ మీడియాలో వెలువడుతున్న అభిప్రాయాలని బట్టి ఆ పెన్ డ్రైవ్ లో ఎంతో ముఖ్యమైన సమాచారం ఉండి ఉండాలి అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

కొందరయితే ఒకడుగు ముందుకేసి పెన్ డ్రైవ్ లో కత్తి మహేష్ ఇంతకు ముందు చెప్పినట్టు పూనం కౌర్ కి, పవన్ కి, త్రివిక్రమ్ కి సంబందించిన ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఇంకొందరు అందులో పవన్ కి సంబందించిన బయటపెట్టా కూడని అత్యంత వ్యక్తిగత సమాచారం ఉంది అంటున్నారు, ఇంకో వర్గం అయితే ఏకంగా పవన్ సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు ఉన్నాయంటున్నారు.

ఈ వ్యాఖ్యలని బలపరిచేలా కొంత మండి పవన్ విమర్సల క్రమాన్ని విశ్లేషిస్తున్నారు కొంత మండి విశ్లేషకులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే తన మీద ఐటీ దాడులు చేయించారని పవన్ ప్రకటించిన తరువాత పరిశీలిస్తే తర్వాత బీజీపీని కాని, జగన్ ని కాని ఒక్క మాటా అనలేదు.

పై పెచ్చు ఈ పరిస్థితికి కారణం ఏపీ ప్రభుత్వమే అని అంత వారే దోచుకున్నారని మాట్లాడటం చూస్తే, పవన్ మీద ఐటి దాడులు జరిగినపప్పుడు దొరికిన ఓ రెండు పెన్ డ్రైవ్ లు కేంద్రం చేతికి వెళ్లాయని, అందుకే పవన్ తెలుగు దేశం మీద విమర్శలు చేసేలా కేంద్రం చేసింది అని చెప్తున్నారు సదరు విశ్లేషకులు.

వాస్తవానికి అసలు పెన్ డ్రైవ్స్ దొరికాయో లేదా, సోషల్ మీడియా వార్తా అనేది ఎవరికీ తెలీదు. కాని నిన్న ఏపీ 24/7 ఛానల్ లో పవన్ ఒక ఇంటర్వ్యూలో సైతం ఆ చానెల్ యాంకర్ పెన్ డ్రైవ్స్ విషయం ఎత్తడం తో నిజంగానే ఏదో విషయం ఉండే ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు.

Related News