//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎదురెదురుగా విమానాలు తృటిలో తప్పిన ముప్పు!

Category : national

సెకన్ల వ్యవధిలో రెండు విమానాలు ఎదురెదురుగా ఢీకొట్టే ప్రమాదం తప్పింది. వెంట్రుక వాసిలో రెండు విమానాల్లో ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విస్తారా ఎయిర్‌లైన్స్‌, ఎయిరిండియాకు చెందిన విమానాలు ఎదురురెదురుగా దూసుకొచ్చాయి.

ఈ రెండు ఒక దాన్ని మరొకటి దాటుకుంటూ వెళ్లిన టైంలో రెండు విమానాల మధ్య దూరం కేవలం 100 అడుగులు మాత్రమే ఉండటం ఏవియేషన్ అధికారులను ఉలిక్కి పడేలా చేసింది. ఇటీవలి కాలంలో భారత గగనతలపై కొద్దిలో తప్పి పోయిన భారీ ప్రమాదం తప్పి పోయిన ఘటన ఇదేనని చెబుతున్నారు.

ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న విస్టారా ఎ-320 విమానం 29 వేల అడుగుల ఎత్తులో ఎగరాలని ఏటీసీ సూచించింది. అదే టైంలో ముంబై నుంచి భోపాల్‌కు ఎయిరిండియాకు చెందిన ఎయిర్‌బస్ ఏ-319 27 వేల అడుగులు ఎత్తులో ఎగురుతోంది.

కానీ విస్టారా పైలెట్లు విమానాన్ని 27 వేల అడుగుల ఎత్తుకి దింపి నడిపారు. దీంతో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ రెండు విమానాలు ఎదురొచ్చాయి. ఒకదానిపై నుంచి మరొకటి కేవలం 100 అడుగుల దూరం నుంచి దూసుకెళ్లాయి. కొద్ది సెకన్ల వ్యవధిలో రెండు విమానాలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టే ప్రమాదాన్ని పైలెట్లు తప్పించగలిగారు. ఈ విషయమై డీజీసీఏ అధికారులు విచారణ చేపడుతున్నారు.