//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మంత్రి వర్గం లోకి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న రాష్ట్ర మంత్రి వర్గం లోని ఇద్దరు బీజేపీ కి చందిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసారు. కేంద్ర కేబినెట్ లోవున్న టీడీపీ ఎంపీలు ఇద్దరు నిన్న సాయంత్రం ప్రధానిని కలిసి తమ రాజీనామా ను సమర్పించారు.

ఇప్పటి వరకు చంద్రబాబు మంత్రి వర్గం లో ముస్లిం లకు కానీ, గిరిజనులకు కానీ చోటు దక్కలేదు. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈ విషయం లో నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల సమాచారం. ఇందులో భాగం గా వైసీపీ నుండి వచ్చిన పీరాయింపు ఎమ్మెల్యే లకు చోటు దక్కుతుందని సమాచారం.

వైసీపీ ఎమ్మెల్యే లు పార్టీ మారెటప్పుడు చంద్రబాబు వారికీ మంత్రి పదవులు ఇస్తానని హామీలు కూడా ఇచ్చాడు. వారిలో కొంతమందికి పదవులు దక్కగా మిగిలిన వారు అసంతృప్తి తో పార్టీ లో కొనసాగుతున్నారు. వారిలో కొంతమందికి ఇప్పుడు అవకాశం ఇస్తారని తెలుస్తుంది.

ఫిరాయింపుల్లో ముస్లింలకు సంబంధించి జలీల్ ఖాన్ లేకపోతే చాంద్ భాష, గిరిజనుల్లో గిడ్డి ఈశ్వరి లేకపోతే కిడారి సర్వేశ్వర్రావు కానీ వంతల రాజేశ్వరికి కానీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టీడీపీ లోకూడా ఒకరిద్దరు గిరిజనులు, ముస్లింలున్నప్పటికీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫిరాయింపు ఎమ్మెల్యే లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని సమాచారం.