లార్డ్స్ స్టేడియంలో ఈ నెల 31న జరుగనున్న ఒకే ఒక టీ20మ్యాచ్ లో విండిస్ -ఐసిసి వరల్డ్ ఎలెవన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఆడడానికి ఇండియా నుండి ఆ ఇద్దరూ యువ ఆటగాళ్లకూ ఐసిసి శుభవార్త చెప్పింది. ఐసిసి వరల్డ్ ఎలెవన్ జట్టులో్ భారత్ నుండి దినేశ్ కార్తిక్, ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యాను సెలక్ట్ చేశారు. ఈ ఏకైక టి20మ్యాచ్ ప్రతిసంవత్సరం జరుపుతారు. అయితే ఇందులో విజయం సాధించిన జట్లు తమ జట్టుకు వచ్చిన ప్రైజ్ మనీకి పేద ప్రజలకు లేదా తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు పంచుతారు. లార్డ్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో ఇండియా నుండి ఈ ఇద్దరి ప్లేయర్లుకు అవకాశం దక్కింది.
ఐసిసి వరల్డ్ ఎలెవన్ టీం లో దినేవ్ కార్తిక్, హార్ధిక్ పాండ్యాతోపాటు రషిద్ ఖాన్, షోయబ్ మాలిక్, తమీమ్ ఇక్బాల్, షకిబుల్ హసన్, థిసారా పెరీరా పలువురు ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం ,డొమికాలోని విండ్ సోర్ పార్క్, సెయింట్ మార్టెన్ లోని కరీబ్ లుంబెర్ పార్కలను పునర్ నిర్మించడం కోసం ఈ మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు. గతేడాది సంబంవించిన ఇర్మా, మారియా తుఫానుల కారణంగా ఇవన్ని దెబ్బతిన్నాయి.