//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అయోధ్యకేసులో ట్విస్ట్ ... విచారణకు ముందే బెంచ్ నుండి వైదొలిగిన న్యాయమూర్తి లలిత్

Category : national

అయోధ్య కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఊహించని ట్విస్ట్ లతో కేసు మరికొద్ది రోజులు జాప్యం జరగనుంది. ఇప్పటికే అయోధ్య వివాదం పై మొత్తం 14 పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఐదుగురు సభ్యుల బెంచ్ అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదాన్ని విచారించనుంది. అయితే అనూహ్యంగా ఈ ఐదుగురు సభ్యుల బెంచ్ నుండి జస్టిస్ లలిత్ వైదొలగారు. అందుకు కారణాలు తెలియలేదు. ఇక విచారణకు ముందే ఆయన వైదొలగడంతో కేసు విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తూ మిగిలిన న్యాయమూర్తులు ఒక ప్రకటన చేశారు.

ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ లో ఒకరు వైదొలిగిన నేపథ్యంలో మరో జడ్జి వచ్చేవరకు అయోధ్య వివాదం విచారణలో జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది . సుప్రీంకోర్టు జనవరి 4న రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై స్పెషల్ బెంచ్ విచారణ చేస్తుందని చెప్పిన నేపథ్యంలో అందుకోసం ప్రధాన న్యాయ మూర్తులైన జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎస్ ఏ బొబ్డే , జస్టిస్ యు వి లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్ లను సభ్యులుగా నియమించింది. టికెట్ ఈ కేసు విచారణ నుండి పక్కకు తప్పుకున్న లలిత్ తనను కొత్త న్యాయమూర్తి వచ్చేవరకు విచారణ ఆగినట్టే

Related News