భారత మార్కెట్లోకి మరో రెండు కొత్త ద్విచక్రవాహనాలను తీసుకురావాలని టీవీఎస్ మోటార్స్ యోచిస్తోంది. ఇందులో ఒకటి మోటర్ సైకిల్ కాగా, మరొకటి స్కూటర్. ఇప్పటికే తన వాహన శ్రేణిలో ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేయాలని కూడా ప్రణాళికలు రచిస్తోంది. బీఎండబ్ల్యూ మోటార్డ్తో కలిసి భారతీయ మార్కెట్లో సరికొత్త వాహనాలను తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.500 కోట్ల మూలధనాన్ని కూడా కేటాయించింది. ఇప్పటికే ఉన్న వాహనాలను అప్‌గ్రేడింగ్ చేయడంతో పాటు ఒక స్కూటర్, ఒక బైక్‌ను ఈ ఏడాది విపణిలోకి తీసుకొస్తాం అని టీవీఎస్ మోటార్ సీఎఫ్‌వో ఎస్జీ మురళి తెలిపారు. అయితే కొత్త ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు.