దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ తన స్కూటీ జెస్ట్ 110 మోడల్ వాహనాలను నూతనంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్-4 ప్రమాణాలు కలిగి ఉన్న ఈ మోడల్ వాహనాలు మంచి పికప్ ను కలిగి ఉండనున్నాయి. ఈ వాహనాలు మ్యాటీ బ్లూ, మ్యాటీ రెడ్, మ్యాటీ ఎల్లో, మ్యాటీ బ్లాక్ రంగుల్లో లభించనున్నాయి. కేవలం మ్యాటీ రంగులతో మాత్రమే కాకుండా 3డీ లోగో, సీట్ కింది భాగంలోని స్టోరేజ్ వద్ద లైట్, సిల్వర్ ఓక్ రంగుల్లో ఇంటీరియర్ ప్యానల్, రెండు రంగులతో సీటు తదితర మార్పులతో జస్ట్ను విపణిలోకి తీసుకొచ్చారు. ఈ సరికొత్త జస్ట్ ధర రూ.48,038(దిల్లీ ఎక్స్ షోరూమ్), టర్కు 62 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. టీవీఎస్ మోటార్ అన్ని షోరూమ్ల్లోనూ సరికొత్త టీవీఎస్ స్కూటీ జస్ట్లు అందుబాటులో ఉండనున్నాయి.