చైనాలోని చోంగ్క్వింగ్ పట్టణంలో ఐదంతస్తుల భవంతిపై రోడ్డు నిర్మించి ఔరా అనిపించారు. రెండులైన్ల రహదారి మధ్యలో చెట్లు, ఆ రోడ్డుపై దుకాణాలు కూడా ఉన్నాయి. ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఫొటోలు వైరల్‌గా మారాయి. భవంతి మొదటి అంతస్తులో షాపులు ఉండగా మిగతా అంతస్తులను కారు పార్కింగ్‌కు కేటాయించారు. కింద ఉన్న వారికి వాహన శబ్దం వినిపించకుండా ప్రత్యేక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. చోంగ్ క్వింగ్లో ఇప్పటికే అద్భుతమైన ఫ్లైఓవర్ తో పాటు నివాస సముదాయాల నుంచి రైల్వే లైన్‌ను కూడా నిర్మించారు.