//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణా టీడీపీ అధ్యక్షుడి సంచలన నిర్ణయం

Category : politics

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా L Ramana, పార్టీకి ర‌థ‌సార‌ధిగా వ్య‌వహరిస్తున్నారు. కేసీఆర్ ప్రలోభాలకు లొంగక, బెదిరింపులకు భయపడక పార్టీని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తున్న రమణ ఇప్పుడు తెలంగాణా లో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో పోటీ విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. TTDP President L. Ramana Shocking Decision

తెలంగాణ‌లో టీడీపీని లేకుండా చేసేందుకు కుట్ర‌లు ప‌న్నిన కేసీఆర్‌, TDP ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి, మంత్రి ప‌ద‌వుల ఆశ చూపించి లాగేసుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ 15 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకోగా.. అందులో 12 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్ర‌లోభాలాకు త‌లొగ్గి, మంత్రి ప‌ద‌వుల కోసం కారెక్కేశారు. ఇక తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప‌నిచేసిన రేవంత్ రెడ్డి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. రేవంత్ మాత్రం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించి హ‌స్తం పార్టీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేత‌లు టీఆర్ఎస్‌లో చేరినా.. పార్టీని అంటిపెట్టుకుని ఉండి కార్య‌క‌ర్త‌ల్లో భ‌రోసా క‌ల్పించారు ఎల్‌.ర‌మ‌ణ‌. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా కూటమి పొత్తుల విషయంలో కీలకంగా వ్యవహరించారు రమణ. TTDP President L. Ramana Shocking Decision

టీడీపీ అధినేత Chandrababu naidu ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలలో బిజీగా ఉండటంతో అన్నీ రమణ తానే అయ్యి చూసుకున్నాడు. ఇప్పుడు తెలంగాణా ఎన్నికల వేళ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సహా పార్టీ గెలుపు కొరకు అన్ని భాద్యతలను రమణ తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పుడు కూడా పార్టీ గెలుపు కోసం రమణ పని చెయ్యాలని సూచించిన బాబు రమణ పోటీ చేసే స్థానం కాంగ్రెస్ కు గెలిచే అవకాశం వుండటంతో త్యాగం చెయ్యమని చెప్పారు. అలాగే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి రమణకు రాజకీయ గురువు కావటంతో రమణ కూడా పోటీ నుండి వైదొలిగారు. మహా కూటమి గెలిస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీ మేరకే రమణ ప్రస్తుతం పోటీ నుండి తప్పుకున్నారు.TTDP President L. Ramana Shocking Decision

రాష్ట్రంలో మహాకూటమిని ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించిన రమణ జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి అండగా ఉండబోతున్నారు..1994లో తొలిసారిగా జగిత్యాల నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి గెలిచిన రమణ మంత్రిగా పనిచేశారు. అక్కడి నుంచి ఐదుసార్లు పోటీ చేసినా కేవలం రెండు సార్లు మాత్రమే శాసన సభలో కి అడుగు పెట్టారు. అయితే పొత్తు ధర్మం ప్రకారం గెలిచేవారికే సీటు ఇవ్వనుండటం వల్ల అలాగే తన గురువైన జీవన్ రెడ్డి పై ఉన్న గౌరవ భావం వల్ల పోటీ నుంచి రమణ తప్పుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రమణ పార్టీ కి కట్టుబడి సీటు త్యాగం చేసి మరోమారు బాబు పట్ల ఉన్న తన విధేయతను చాటుకున్నాడు.TTDP President L. Ramana Shocking Decision

Related News