దేశ రాజధాని ఢిల్లీలోని తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగానికి బాధ్యత వహిస్తూ TTD లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పదవికి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేశారు. ఇదే సమయంలో TTD వైఖరిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆకాశరామన్న ఫిర్యాదుపై టిటిడి స్పందించడం బాధాకరం అన్నారు.
నిధుల గోల్మాల్పై ఆరోపణలు రావడంతో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి చేత విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. అయితే ఇదే సమయంలో TTD మాత్రం ఎస్సై స్థాయి అధికారిని విచారణకు పంపడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. TTD వైఖరి ఏపీ భవన్ విలులను తగ్గించేలా ఉందని ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటిపై TTD, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా విచారణ ఆగలేదన్నారు. TTD వైఖరిని నిరసిస్తూ లోకల్ అడ్వైజరి కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ ప్రకటించారు. ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.