//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్కడ పెళ్లి చేసుకుంటే శ్రీవారి దర్శనం ఫ్రీ

Category : national

ఏడుకొండల సామి వేంకటేశుడంటే భక్తులకు కొండంత నమ్మకం..ఇక అలాంటి కొండపైనే పెళ్లి చేసుకుంటే వారి ఆనందానికి అంతే ఉండదు..అలాంటి కొత్తజంటలకు తిరుమల బోర్డు ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది..ఆన్ లైన్లో కల్యాణవేదికను బుక్ చేసుకోవడం చేస్తే చాలు...ఇక పెళ్లి కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ముందు తల్లిదండ్రుల వివరాలు..ఫోటో ఐడీలతో ఆన్ లైన్లో అప్ డేట్ చేయాలి. కల్యాణవేదిక అనే కాలమ్ లో ఈ వివరాలన్నీ అప్ లోడ్ చేసిన తర్వాత అక్కడున్న ప్రకారంగా బర్త్ సర్టిఫికెట్లు..పెళ్లి తేదీ టైమ్ ఫిక్స్ చేస్తే చాలు..అక్నాలెడ్జ్ మెంట్ వస్తుంది ఆ ప్రింట్ పట్టుకెళ్లి డైరక్ట్ గా తిరుమలకి వెళ్లడమే.. అక్కడి తిరుమల తిరుపతి దేవస్థానం అఫిషియల్స్ తో ఇంకోసారి డీటైల్స్ చెక్ చేసుకుంటే చాలు..పురోహితుడు, సన్నాయిమేళం, ఓ రూమ్..పెళ్లి వసతులన్నీ బోర్డే  ఇచ్చేస్తోంది..ఇతర ఖర్చులు మాత్రం పెళ్లివారు పెట్టుకోవాలి.. ఇక పెళ్లైన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి ఏటీసీ క్యూలైన్ నుంచి ఆరుగురు ఫ్రీగా వెళ్లొచ్చు..పది చిన్న లడ్డూలు ఫ్రీగా అందుకోవచ్చు..నిజంగా పేదవారికే కాదు..భక్తులందరికీ ఇదో గొప్ప కానుకగానే చెప్పాలి మరి.