//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మొదటి వన్డే లో టీమ్ ఇండియా ఘనవిజయం.....!

Category : sports

ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 269 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఆరు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఈ విజయంతో పలు రికార్డులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో భారత్ ఏడేళ్ల తర్వాత సాధించిన తొలి విజయమిది. జనవరి 18, 2011న చివరిసారి సఫారీ గడ్డపై భారత్ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వన్డేల్లో విజయం సాధించింది. అంతేకాదు సొంతగడ్డపై 17 వరుస విజయాలతో దూకుడుమీదున్న డుప్లెసిస్ సేనకు భారత్ కళ్లెం వేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో 112 పరుగులతో కెరీర్‌లో 33వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీకి సఫారీ గడ్డపై మొదటి శతకం కావడం గమనార్హం. ఈ సెంచరీతో కోహ్లీ ఖాతాలో మొత్తం 54 సెంచరీలు చేరాయి. అతడి కంటే ముందు జాక్విస్ కలిస్ (62), కుమార్ సంగక్కర (63), రికీ పాంటింగ్ (71), సచిన్ టెండూల్కర్ (100) ముందున్నారు. ఫోర్ తో మహేంద్ర సింగ్ ధోనీ విన్నింగ్ షాట్ కోట్టాడు.