రోజూ మన కంటికి కన్పించేవాటిలో ఎన్నో అద్భుతమైన మూలికలు ఉంటాయ్. కానీ మనం వాటిని పట్టించుకోం..ప్రకృతి ప్రసాదించిన వాటిని పక్కనబడేసి హాస్పటల్స్ వైపు పరుగులు తీస్తుంటాం..కీళ్లనొప్పులు, ప్రోటీన్ లోపం, షుగర్ లెవల్స్ పెరగడం , కంటి చూపు తగ్గడం వంటి అనేక రోగాలకు మునగాకుతో చెక్ పెట్టొచ్చు..మొత్తం తగ్గుతుందని కాదు కానీ..చాలావరకు బాధలు తగ్గిపోతాయ్.. ఓ అరటి పండు, గ్లాసెడు పాలలో ఉండే ప్రోటీన్లు ఓ గుప్పెడు మునగాకులో ఉంటాయ్. ఐతే ఇవి ఎలా తీసుకుంటారనే విషయంపైనే ఇందులో ముఖ్యం. మునగాకు పొడి స్పూన్ తింటే మూడు నెలల్లో షుగర్ తగ్గుతుందట..అంటే దీన్ని మనం ఎలా చూడాలంటే మొత్తం షుగర్ జబ్బు లేకుండా పోతుందని కాదు...షుగర్ లెవల్స్ నార్మల్ కి వస్తాయని లెక్క...ఇక థైరాయిడ్ ప్రాబ్లెం ఉన్నవాళ్లు కూడా వారానికి కనీసం రెండుసార్లు మునగాకు కూర చేసుకుంటే బెటర్..ఇక రోజూ గ్లాసు మునగాకు రసం తాగితే కంటిచూపు దెబ్బతినడం తగ్గుతుందట.రేచీకటి వంటి వాటిని అసలు దగ్గరకు రానీయదట మునగాకు.