//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇలా చేస్తే చుండ్రుని దూరం చేయవచ్చు!

Category : health

“చుండ్రు” ఒకప్పుడు చలికాలం మాత్రమే వచ్చే సమస్య. ఇప్పుడు కాలాలు, వాతావరణం సంబంధం లేకుండా వచ్చేస్తుంది. ముఖ్యంగా యువతలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం పెరిగిన కాలుష్యమే. ఎక్కువగా ప్రయాణాలు ఉన్న వారిని చుండ్రు సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. కొందరు చుండ్రు కోసం అనేక రకాల షాంపూలు వాడినా పెద్దగా ఫలితం మాత్రం ఉండదు. దీనితో గుండు చేయించడం మేలు అని చెప్పి చేయించుకునే వారు కూడా ఉన్నారు. యువతలో ఎక్కువగా ఉండే చుండ్రు సమస్యతో వ్యాధులు కూడా వస్తాయని…

2. అవి దీర్ఘకాలం ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి…? డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా సమస్య మాత్రం తీరే అవకాశాలు కనపడటం లేదు. అయితే మన చేతిలో ఉన్న వాటి ద్వారానే దీనికి పరిష్కారం చూపించవచ్చునని కొందరు అంటున్నారు. ఇందుకు కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు చుండ్రు సమస్య నుంచి బయట పడే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌: దీనికి యాంటీఫంగల్‌ గుణాలు ఉంటాయి. దీన్ని నేరుగా అప్లై చేయవచ్చు, పదార్థాలతో కలిపి తినవచ్చు.

3.శరీరంలో పిహెచ్‌ బ్యాలెన్స్‌ సరిచేసి, వెంట్రుకల కుదుళ్లను బలపరచడం ద్వారా చుండ్రు తొలగిపోయేలా చేస్తుంది. బేకింగ్‌ సోడా: కుదుళ్ల దగ్గర సహజసిద్ధమైన తేమ పోకుండా నిలిచి ఉండాలంటే తడిచిన కుదుళ్లకు బేకింగ్‌ సోడా పట్టించి మర్దన చేయాలి. కొద్ది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. కలబంద: పొడిబారిన కుదుళ్లకు మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. దీనిలోని యాంటీసెప్టిక్‌ గుణాలు చుండ్రును పెంచే బ్యాక్టీరియాను చంపేస్తాయి. యాస్ర్పిన్‌: దీన్లో అసిటైల్‌సిలిసిలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను చంపి, మృత చర్మాన్ని వదిలిస్తుంది. రెండు మాత్రలు పొడిచేసి, షాంపూతో కలిపి తల రుద్దుకుని స్నానం చేయాలి.