//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మమ్మల్ని వెధవల్ని చేశారు : పాకిస్తాన్ పై ట్రంప్ ఫైర్

Category : world

న్యూఇయర్ వేడుకల తర్వాత చేసిన తొలి ట్విట్ లో ప్రపంచ దేశాలపై తన వైఖరిని వెల్లడించారు. అందులో పాక్ ద్వంద వైఖరి, తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ మిలటరీకి చేస్తున్న 255 మిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అధ్యక్షుడు ట్రంప్.

మా సొమ్ము తింటూ మమ్మల్నే చంపుతారా.. మా వాళ్లను చంపినోళ్లకే మీరు ఆశ్రయం ఇస్తారా.. మీ కపట నాటకాలు మాకు తెలిసిపోయాయి. ఇక మీ ఆటలు సాగవు అంటూ పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా.

సాయం చేస్తున్న అమెరికా నేతలు మూర్ఖులుగా కనిపిస్తున్నారా అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. పాక్ అబద్దాలతో మోసం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు రూ.2 లక్షల కోట్ల సాయం చేసింది అమెరికా. అందుకు ప్రతిగా పాక్ ఉగ్రవాద కేంద్రాలను పెంచిపోషించింది. ఇన్నాళ్లు మా నేతలను ఫూల్స్ చేశారని పాక్ తీరును తిట్టిపోశాడు.

పాక్ పై ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడటం అమెరికా ఇదే మొదటిసారి. ఉగ్రవాదాన్ని తమ దేశం నుంచి తరిమికొట్టాలన్న ఉద్దేశం పాకిస్తాన్ కు లేదని స్పష్టం అయ్యిందన్నారు ట్రంప్. దీంతో వారికి ఇవ్వాలనుకున్న రూ.14వేల కోట్లు (255మిలియన్ డాలర్లు) నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదంపై పాక్ తన వైఖరి మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.

Related News