Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

Category : world

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేక్ ఇన్ అమెరికా అనే నినాదంతో దూసుకుపోతున్న ట్రంప్ తాజాగా కొత్త వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. విదేశాల నుంచి దిగుమతవుతున్న ఆటోమొబైల్‌ వాహనాలు, విడి భాగాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చౌకగా వచ్చిపడుతున్న ఈ దిగుమతులతో అమెరికా ఆటోమొబైల్‌ పరిశ్రమకు, జాతీయ భద్రతకు ఏమైనా ముప్పు ఏర్పడుతుందో దర్యాప్తు చేయాలని వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రాస్‌ను ఆదేశించారు.

స్టీలు, అల్యూమినియం దిగుమతులపై సుంకం పెంపు వివాదం తేలక ముందే ట్రంప్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ దర్యాప్తులో ట్రంప్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే చైనా, జర్మనీ, మెక్సికో, కెనడా నుంచి వచ్చే కార్లు, ట్రక్కులు, ఎస్‌యువిలపై అమెరికా భారీగా సుంకాలు విధించే అవకాశం ఉంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్రంప్‌ సర్కార్‌ చర్యలపై మండిపడ్డారు. జాతీయ భద్రతా చట్టంలోని నిబంధలను ట్రంప్‌ సర్కార్‌ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వలన అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటుందని... అయితే తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు గట్టిగా కాపాడుకుంటామని హెచ్చరించారు.

Related News