అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్ కు భారీగా సైనిక సహాయం తగ్గించింది. విదేశీ సైనిక నిధి నుండి చేస్తున్న సహాయాన్ని 225 మిలియన్ డాలర్ల నుండి 100 మిలియన్ డాలర్లకు, అంటే 60 శాతం తగ్గించారు. ఈ మొత్తాన్ని కూడా సహాయమా లేదా రుణమా అన్నది తరువాత నిర్ణయిస్తామని చెప్పారు. అంటే 2016లో చేసిన సహాయంతో పోల్చుకొంటే 2018లో 190 మిలియన్ డాలర్లను తగ్గిస్తున్నారు.
విదేశీ సైనిక నిధిని హామీ గల రుణంగా మాత్రమే అందజేస్తామని వైట్ హౌస్ లో బడ్జెట్ యాజమాన్య డైరెక్టర్ మిక్ మూలవనీ తెలిపారు. పలు దేశాలకు సహాయంగా ఇస్తున్న విదేశీ సైనిక నిధిని రుణంగా మార్చలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిందని, అటువంటి దేశాల్లో పాకిస్తాన్ ఒకటని ఆయన చెప్పారు.
అయితే ఈ మొత్తాన్ని హామీ గల రుణానికి సబ్సిడీ గా ఇవ్వాలా లేదా గ్రాంట్ గా ఇవ్వాలా అన్నది స్టేట్ డిపార్ట్మెంట్ నిర్ణయిస్తుందని అన్నారు. మరోవంక రెండేళ్లుగా అమెరికా పాకిస్తాన్ కు 9 మిలియన్ డాలర్లుగా సమకూర్చుతున్న కౌంటర్ ఇన్సూర్జెన్సీ క్యాపబిలిటీస్ ఫండ్ ను ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి ప్రారంభం అయ్యే 2018 ఆర్ధిక సంవత్సరంలో నిలిపి వేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇజ్రాయిల్ కు అయితే ఇజ్రాయిల్, ఈజిప్ట్ లకు గ్రాంట్ గానే ఈ నిధి సమకూర్చుతామని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ కు 3.1 బిలియన్ దళాల్రు, ఈజిప్ట్ కు 1.3 బిలియన్ డాలర్లు, జోర్డాన్ కు 350 మిలియన్ డాలర్లు, పాకిస్తాన్ కు 100 బిలియన్ డాలర్ల సైనిక సహాయ నిధి సమకూర్చాలని నిర్ణయించారు.
నేరుగా 100 మిలియన్ డాలర్ల ఋణం ఇచ్చే బదులు ఆ మేరకు ఋణం సమకూర్చు కోవడానికి హామీ ఇవ్వాలని అమెరికా ఇప్పుడు ఆలోచిస్తున్నది. ఈ 100 మిలియన్ డాలర్లను కూడా అమెరికా భద్రత ప్రయోజనాల మేరకు పాకిస్థాన్ ఉగ్రవాదం కట్టడి చేయడం కోసం అవసరమైన సామర్ధ్యం పెంపొందింప చేసుకొనడం కోసం అందజేస్తారు.