అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎనిమిది రోజుల పాటు జరిపే విదేశీ పర్యటనకు సౌదీ అరేబియాతో ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. మొత్తం 8రోజుల పాటు సాగే పర్యటనలో ఆయన సౌదీతో పాటు జెరూసలెం, వాటికన్ సిటీలనూ సందర్శించనున్నారు. సౌదీకి అవసరమైన రక్షణరంగ ఉత్పత్తుల్ని అమెరికా నుంచి సరఫరా చేయడానికి 110 బిలియన్ డాలర్ల (భారత్ కరెన్సీలో సుమారు రూ.7.15 లక్షల కోట్లు) విలువైన ఒప్పందాన్ని తొలిరోజే ట్రంప్ కుదుర్చుకున్నారు. సౌదీ చేరుకున్న ట్రంప్ దంపతులకు రియాద్‌లో దేశ రాజు సల్మాన్ స్వాగతం పలికారు. ఆదివారం ఇస్లాంపై ముస్లిం దేశాలనేతలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.