//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అసెంబ్లీ లో చర్యలు తీసుకునే దిశగా తెరాస...!

Category : politics

నిన్న తెలంగాణ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంబమైయ్యాయి. అసెంబ్లీ, మండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తీవ్రమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గాతీసుకున్నది.

అసెంబ్లీ లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం అయన ఫై ఈరోజు సభలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని సమాచారం. ఈ వ్యవహారంలో కోమటిరెడ్డి సహా ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.

అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పీకర్ మధుసూదనాచారి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కోమటిరెడ్డి విసిరిన హెడ్‌ఫోన్స్‌ తగిలి శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి కొంతమేర గాయమైంది. వెంటనే ఆయన్ని సరోజిదేవి కంటి ఆస్పత్రికి తరలించారు.

స్వామిగౌడ్‌ కుడికన్ను కార్నియా దెబ్బతిన్నదని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వామిగౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు సభ కాంగ్రెస్ నేతల సస్పెంషన్ టోన్ మొదలు కావచ్చు అని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ నేతలపై చర్యలపై తీసుకుంటే ఈ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నదని రాజకీయవర్గాల సమాచారం.

Related News