//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీలో టీఆర్ఎస్ సర్వే.. ఎవరికి ఎన్ని సీట్లంటే

Category : politics

రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో టీఆర్ఎస్ పార్టీ సర్వే నిర్వహించింది. ఏపీలో చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్న టీఆర్ఎస్ ఏపీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. విపక్ష వైసీపీకి బహిరంగంగానే తమ మద్దతు ప్రకటించిన తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్...

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోల్పోవడం ఖాయమని పదే పదే చెబుతోంది. ఏపీలో టీడీపీని ఓడించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని బాహటంగానే ప్రకటించిన టీఆర్ఎస్... ఇందుకు సంబంధించి సర్వేలు కూడా చేయిస్తోందని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వేలో వైసీపీకి అధికారం ఖాయమని టీఆర్ఎస్ నిర్ధారణకు వచ్చింది. ఏపీలో రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న టీఆర్ఎస్... వైసీపీ, టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై అంచనా వేసుకుంటోంది.

ఈ క్రమంలోనే ఇటీవల టీఆర్ఎస్’కు అందిన సర్వే ఫలితాల్లో ఏపీలో వైసీపీకి 92 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేలినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో అధికార టీడీపీకి 70 సీట్లకు మించి రావని... జనసేన సహా ఇతర పార్టీలు 13 సీట్లకే పరిమితమవుతాయని టీఆర్ఎస్ తాజా సర్వేలో తేలినట్టు సమాచారం. అంతకుముందు వైసీపీకి వందకు పైగా సీట్లు వస్తాయని టీఆర్ఎస్ సర్వేల్లో వెల్లడి కాగా... ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాల కారణంగా టీడీపీ పరిస్థితి కొంత మెరుగైనట్టు తేలింది. అయితే రోజురోజుకు ఏపీలో టీడీపీ గ్రాఫ్ పడిపోతోందని టీఆర్ఎస్ సర్వేలో తేలినట్టు సమాచారం.ఇక ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని తాజా సర్వే ద్వారా టీఆర్ఎస్ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏపీ ఎన్నికలపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్... టీడీపీని ఓడించేందుకు అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించింది. చూడాలి మరి ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏం చేస్తుందో ..!!