//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్

Category : politics

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులని ఫైనల్ చేసి వారి పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ భవన్ లో ఈ రోజు నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించారు. జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ (నల్లగొండ), బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్) పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు రేపు నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం.

కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడు సంతోష్ కుమార్. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ కు జోగినపల్లి సంతోష్ కుమార్ సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా, టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆయన, పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

2009లో టీడీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న లింగయ్య యాదవ్ పోటీ చేసి ఓడారు. 2015లో టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయనకు యాదవుల కోటాల రాజ్యసభ సీటు దక్కింది.

Related News