//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అసెంబ్లీ లో కాంగ్రెస్ తీరుపై టీఆర్ఎస్ సీరియస్...!

Category : politics

తెలంగాణ రాష్ట్రములో ఈ రోజు బడ్జెట్‌ సమావేశాలల్లో అసెంబ్లీలో తీవ్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు పోడియం దగ్గరకు కాంగ్రెస్ నేతలు వచ్చారు , కానీ వారిని పోడియం దగ్గరకు పోకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ పరిణామం తో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన హెడ్‌సెట్‌ను విసిరారు. ఆ హెడ్ సెట్ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలింది. అయన కంటికి స్వల్ప గాయాలయ్యాయి, వెంటనే ఆయనను సరోజనినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

సభ లోపల జరిగిన పరిణామాలఫై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియామాట్లాడుతూ . గవర్నర్‌ ప్రసంగంలో రైతు సమస్యల గురించి మాట మాత్రమైనా స్పందించకపోవడంపై తాము ఆందోళన చేశామని, అయితే, కొంత ఆవేశానికి గురైనమాట వాస్తవమేనని అయన చెప్పారు.

విపక్ష సభ్యులుగా మాకు నిరసన తెలియజెప్పడానికి కూడా హర్హత లేదా అని అయన అన్నారు. ఆ గలాటాలో మార్షల్స్‌ నన్ను కూడా తన్నారు. నా కాలికి గాయమైంది. ఎక్స్‌రే కూడా తీయించుకున్నాను. అయినా, మమ్మల్ని పోడియం వద్దకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు, పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రతిరోజూ స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళుతున్నారుకదా, మరి ఇక్కడ మాత్రం నిర్బంధాలు ఎందుకు అని కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.

గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగిలితే తీవ్ర పరిణామాలు తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందే చెప్పారు. అయినాకూడా కాంగ్రెస్‌ నేతలు ముందు చెప్పినట్లే సభలో ఆందోళన బాట పట్టింది. బడ్జెట్‌పాత్రలను చించి, గవర్నర్‌పైకి విసిరారు. అక్కడ జరిగిన తతంగాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, కాంగ్రెస్‌ సభ్యులపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటారని రాజకీయ వర్గాల సమాచారం.