//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2019 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమా? కారణాలు ఇవే...

Category : politics

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక తొలిసారి 2014 జరిగిన ఎన్నికలలో కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. అప్పటి ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే తోలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ కెసిఆర్ మాట ఇచ్చాడు. పార్టీ గెలిసిన అనంతరం మాటతప్పి తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. తన కుటుంభంలో ఉన్న వారైనా కెటిఆర్, హరీష్ రావు లకు మంత్రిపదవులు ఇచ్చుకున్నాడు. ఇది ప్రజాప్రభుత్వం కాదని కుటుంబ ప్రభుత్యం అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసారు.

రీసెంట్ గా శాసనసభని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెర లేపారు. పైగా తమ అభ్యర్థులను కూడా ప్రకటించేసారు.అయితే ఎన్నికల సంఘం డేట్స్ కూడా ప్రకటించింది. ప్రచార కార్యక్రమంలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థులకు, ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా కెసిఆర్ ఓడిపోవడం ఖాయమంటున్నారు ప్రతిపక్ష నాయకులు. దీనికి కారణం గత ఎలక్షన్స్ టైములో కెసిఆర్ ప్రకటించిన హామీలను నెరవేర్చకపోవడమే అంటున్నారు రాజకీయ విశ్లషకులు.

దానిలో ముఖ్యంగా..
• ఇంటింటికి ఉద్యోగం
• ఇంటికి నాలుగు ఎకరాలు భూమి...
• కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోవటం వలన వారు కెసిఆర్ పై నెగిటివ్ అవ్వడం.
• మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లో తీసుకుపోవడం.
• డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని ఇవ్వకపోవడం.
• ఉస్మానియా స్టూడెంట్స్ యాంటీగా ఉండటం.
• చంద్రబాబు ని తీవ్రంగా తిట్టడం వలన, ఇక్కడ ఉన్న సెటిలర్స్ కెసిఆర్ పై వ్యతిరేకంగా ఉండటం.

పై నున్న హామీలను కెసిఆర్ సమర్దవంతంగా నిర్వర్తించకపోవడం వలన తెలంగాణ ప్రజలు కెసిఆర్ పై గుర్రు గా ఉన్నారని రాజకీయ వర్గాల నుండి వస్తున్న సమాచారం.

Related News