//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలంటేనే.. భ‌య‌ప‌డుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి..!

Category : state politics

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రంలో పార్టీల‌న్నీ ఇంకా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద‌గ్గ‌రే కిందా.. మీదా.. ప‌డుతున్నాయి. కానీ, టీఆర్ఎస్ మాత్రం 105 మంది అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించేసింది. వారు ప్ర‌చార ప‌ర్వాన్ని కూడా మొద‌లు పెట్టేశారు. ఇది టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు క‌లిసి వ‌చ్చే అంశ‌మే. అదే స‌మ‌యంలో ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో రెబ‌ల్స్ బెడ‌ద కూడా వారిని వెంటాడుతుంద‌ట‌. రామ‌గుండం నుంచి మ‌రోసారి పోటీకి రెడీ అయిన సోమార‌పు సత్యనారాయణ కు ఇండిపెండెంట్ ముచ్చెమ‌ట్లు ప‌ట్టిస్తున్నార‌ట‌. TRS MLA fear to start Election Campaign

నిజానికి సోమారపు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది ఇండిపెండెన్స్‌గానే. 2009లో ఆయ‌న స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ త‌రువాత టీఆర్ఎస్‌లో చేరారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. అదే సోమార‌పు స‌త్య‌న్నారాయ‌ణ‌కు స్వ‌తంత్ర్య అభ్య‌ర్థులు ద‌ఢ పుట్టిస్తున్నార‌ట‌. పైగా వారు టీఆర్ఎస్ రెబ‌ల్స్ కావ‌డం మ‌రింత‌గా కంగారు రేపుతుండ‌ట‌. రామ‌గుండం నుంచి ఈ సారి టీఆర్ఎస్ త‌రుపున బ‌రిలోకి దిగాల‌ని పోరుగుంట చంద‌ర్ విశ్వ‌ప్ర‌య‌త్నం చేశార‌ట‌. కానీ, కేసీఆర్ సోమార‌పు వైపే మొగ్గు చూపారు.TRS MLA fear to start Election Campaign

గ‌త ఎన్నిక‌ల్లో ఇండిపెండెన్స్‌గా పోటీ చేసి కేవ‌లం 2 వేల ఓట్ల తేడాతో ఓటమిపాల‌య్యారు చంద‌ర్‌. ఆ త‌రువాత గులాబీ తీర్థం తీసుకున్నారు. టిక్కెట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన చంద‌ర్ తిరిగి స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగా పోటీ చేసి త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్నార‌ట‌. TRS MLA fear to start Election Campaign

మ‌రో వైపు రామ‌గుండం జ‌డ్పీటీసీ స‌భ్యురాలు కంగుల సంధ్యారాణి కూడా ఈ సారి టిక్కెట్ ఆశించార‌ట‌. కానీ, నిరాశే ఎదురు కావ‌డంతో ఆమె కూడా ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. మ‌రో వైపు మాజీ మేయ‌ర్ ల‌క్ష్మీ నారాయ‌ణ, మాజీ డిప్యూటీ మేయ‌ర్ శంక‌ర్ కూడా సోమార‌పు సత్యనారాయణ కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌ట‌. ఈ సారి ఆయ‌న్ను ఓడించి తీరుతామ‌న్న రీతిలో పావులు క‌దుపుతున్నార‌ట‌. దీంతో ఒక‌వైపు అస‌మ్మ‌తిపోరు.. మ‌రో వైపు రెబ‌ల్స్ బెడ‌ద‌, ఈ రెండు స‌మ‌స్య‌ల‌ను అదిగ‌మించి, ఆ త‌రువాత ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌ను ఢీకొట్టాల్సిన ప‌రిస్థితి సోమార‌పు సత్యనారాయణ కు ఏర్ప‌డింద‌ట‌.TRS MLA fear to start Election Campaign

Related News