//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గోవా జైల్లో టీఆర్ఎస్ నేతలు !

Category : national

నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు గోవా వెళ్లిన కొందరు టీఆర్ఎస్ నేతలకి ఊహంచి షాక్ తగిలింది.

సంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు టీఆర్ఎస్ ‌నేతలు నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు వెళ్లారు. సంతోషంగా న్యూ ఇయర్‌ను ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వాళ్లకు అనుకోని కష్టాలు వచ్చిపడ్డాయి. వేడుకలకు ఎంజాయ్ చేయడానికి వచ్చి పోలీస్ స్టేషన్‌లో అక్కడ జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సివచ్చింది.

వివరాల్లోకి వెళితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకునేందుకు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్ దేవానందం సహా 16 మంది టీఆర్ఎస్ నేతలు గత నెల 29న టూర్‌కు వెళ్లారు. అందులో భాగంగా షిర్డీ ఇతర ప్రాంతాలను సందర్శించిన వారు 1న గోవా చేరుకున్నారు.

గోవాలోని కొలంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తివైవాడో గెస్ట్‌హౌస్‌లో బస చేసిన వారికి గెస్ట్‌హౌస్‌ ముందు వాహనం ఆపడంతో వారికి సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. ఈ కేసులో మొత్తం 15 మందిని అరెస్ట్ చేసినట్లు కొలంఘడ్ పోలీసులు మీడియాకు వివరించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇలా జరిగిందని తెలుసుకున్న బాధితుల కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వారు అక్కడి జైల్లో ఉన్నారు. విషయం తెలియడంతో వారిని విడిపించేందుకు దేవానందం సోదరుడు శ్రీకాంత్ న్యాయవాదితో కలిసి గోవా వెళ్లారు.