//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెరాస కి షాక్ ఇచ్చిన లగడపాటి ...!

Category : state politics

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 119 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం పరిచారు . పోలింగ్‌ కేంద్రాల వద్ద వరుసలో ఉన్నవారు మాత్రం ఇంకా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్‌ ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో 5గంటలకు ముగించారు.

మాజీ ఎంపీ, ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలను బయటపెట్టారు. కొద్దిసేపటి క్రితం అయన మాట్లాడుతూ ఎన్నో ఎన్నికల్లో మేము సర్వేలు నిర్వహించాము కానీ , ఈ ఎన్నికల్లో ఫలితాలు చెప్పడానికి చాలా కష్టం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు . ఇక టీఆర్‌ఎస్ 35 స్థానాలకే పరిమితవుతుందని, పది సీట్లు అటూ ఇటూ కావచ్చని తేల్చేశారు. ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని తెలిపారు. ఇండిపెండెంట్లకు 8-10 సీట్లు వస్తాయని, బీజేపీకి గతంలో కంటే ఎక్కువగా అంటే, 7 సీట్లకు అటు ఇటు వస్తాయని, టీడీపీ పోటీ చేసిన 12 స్థానాల్లో 2 చోట్ల ఇండిపెండెంట్లు గెలుస్తారని వెల్లడించారు. మొత్తం మీద ఏడుగురు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా కనిపించిందని, ఎప్పుడూ లేనంతగా డబ్బు ఖర్చు పెట్టారని లగడపాటి తెలిపాడు .

Related News