//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ ఎన్ని కుతంత్రాలు ప‌న్నినా.. ఆ సీటు టీడీపీకే..!

Category : politics state

అది హైద‌రాబాద్‌, చంద్ర‌బాబు నాయుడు అభివృద్ధి చేసిన హైద‌రాబాద్‌. అందుకే, తెలంగాణ వ‌చ్చిన తొలి ఎన్నిక‌ల్లో మ‌హాన‌గ‌రంలో టీడీపీని ఏ పార్టీ కూడా దెబ్బ‌కొట్ట‌లేక‌పోయింది. ఎన్నిక‌ల త‌రువాత టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్లినా.. ప్ర‌జ‌లు మాత్రం టీడీపీతోనే ఉన్నారు. ఇక ఇప్పుడు ముంద‌స్తు మేగాలు ఉరుముతున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్‌ను ఓడించ‌డానికి మ‌హా కూట‌మి నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుల ద్వారాలు తెరుచుకున్నాయి.TRS doing any illegal Activities TDP Definitely Win  

ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో పోయిన సారి టీడీపీ గెలిచిన సీట్ల వ్య‌వ‌హారం ర‌స‌కందాయ‌నంలో ప‌డింది. సిట్టింగ్ సీట్లు.. టీడీపీకి ఇచ్చేయ్యాల్సిన సీట్ల‌లో కాంగ్రెస్ కూడా పాగా వేయాల‌ని చూస్తుండ‌టం చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఇలాంటి వాటిలో ముఖ్య‌మైంది ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం. TRS doing any illegal Activities TDP Definitely Win

ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య పోటీ ఉంటుంది. టీడీపీ సిట్టింగ్ స్థాన‌మైన దానిలో టీడీపీ పోటీ చేస్తుందా..?  లేక కాంగ్రెస్‌కు వ‌దిలేస్తుందా...?  అనేది ఇప్పుడు చ‌ర్చ‌.  నిజానికి గతంలో అన్ని ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నా ఈ సీటులో టీడీపీ బ‌లం ఎక్కువ‌. కాంగ్రెస్‌ది రెండో స్థాన‌మే. అయితే, నియోజ‌క‌వ‌ర్గంపై రెండు పార్టీలు ప‌ట్టు బిగించాయి.

పొత్తులో భాగంగా ఎల్బీన‌గ‌ర్ స్థానంలో ఏ పార్టీకి కేటాయించాలి..?  పోటీ చేసే అభ్య‌ర్థుల స్థాయిని.. బ‌లా బ‌లాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే, ఎల్బీ న‌గ‌ర్ స్థానంలో పోటీ చేసే అభ్య‌ర్థిని ఈ రెండు పార్టీల నేత‌లు అతి త్వ‌ర‌లో ఎంపిక చేయ‌నున్నారు. TRS doing any illegal Activities TDP Definitely Win

Related News