//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేవిని అందుకే ప్రక్కన పెట్టా: త్రివిక్రమ్

Category : movies

టాలీవుడ్ లో కొంతమంది సంగీత దర్శకుల పాటలు వినంగా వినంగా బాగుంటాయి. కానీ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించే పాటలు మాత్రం వినిన వెంటనే అందరికి నచ్చుతాయి. కథకి అనుగుణంగా సంగీతాన్ని ఇవ్వడంలో అతనికి అతనే సాటి. అందుకే చాల మంది దర్శకులు దేవీశ్రీ ని ఇష్టపడతారు. పైగా అత్యధిక రెమ్యునరేషన్ కూడా ఇస్తుంటారు.

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐతే ఎక్కువ శాతం దేవినే సంగీత దర్శకుడిగా తీసుకుంటాడు, కానీ గత కొంత కాలం నుచి దేవిశ్రీని దూరం పెట్టారు. వీరి కాంబినేష‌న్‌లో వచ్చిన జల్సా జులాయి, అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. కానీ త్రివిక్ర‌మ్ అ..ఆ సినిమాకి దేవీని తీసుకుంటారని అనుకుంటే పక్కన పెట్టారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని అప్పట్లో పెద్ద రూమర్లే వచ్చాయి.వాటిని నిజం అనుకునేలా త్రివిక్రమ్ అజ్ఞాత‌వాసి, అర‌వింద స‌మేత చిత్రాల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్లను మార్చారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ నిజమే అని అందరూ ఫిక్స్ అయ్యారు.

ఈ విషయంపై త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చారు. ” దేవీ శ్రీ ప్ర‌సాద్‌తో నేను ఎక్కువ‌గా సినిమాలు చేశాను. అత‌నితో నాకు చాలా కంఫ‌ర్ట్‌గా ఉంటుంది. నా గత మూడు చిత్రాల‌కు దేవీని తీసుకోక‌పోవ‌డం వెనుక పెద్ద కార‌ణాలు లేవు. అ..ఆ చిత్రం లోబ‌డ్జెట్‌తో తెరకెక్కింది. రెమ్యున‌రేష‌న్ దృష్ట్యా దేవీని తీసుకోలేదు. దీంతో నాకు దేవీకి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని అందుకే దేవీని సైడ్ చేసాడు త్రివిక్ర‌మ్ అంటూ వార్త‌లు, రూమ‌ర్లు చాలానే వ‌చ్చాయి. అందులో నిజం లేదు అని స్పష్టం చేశారు త్రివిక్రమ్.