//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్రివిక్ర‌మ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే..!

Category : movies

అర‌వింద స‌మేత చిత్రం త‌రువాత త్రివిక్ర‌మ్ నిజానికి వెంకీతో మూవీ చేయాల్సి ఉంది. బాలీవుడ్ సూప‌ర్ హిట్ జాలీ ఎల్ఎల్‌బీ - 2 చిత్రాన్ని తెలుగులో వెంకీతో రీమేక్ చేయ‌డానికి గ‌తంలోనే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు త్రివిక్ర‌మ్‌.

అయితే, ఇప్పుడు రీమేక్‌ను ప‌క్క‌న‌పెట్టి కొత్త క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు. అయితే, వెంకీకి కావాల్సిన క‌థ మాత్రం కుద‌ర‌డం లేదు. దీంతో స్టోరీ సెట్ అయ్యేలోపు మ‌ద్య‌లో మ‌రో చిత్రాన్ని చెయ్యాల‌నుకుంటున్నాడ‌ట‌.

వెంకీ మూవీకి స్టోరీ సెట్ కావ‌డం లేట్ అవుతుండ‌టంతో ఈ లోపు బ‌న్నీతో ఓ మూవీ చేసేందుకు రెడీ అయ్యాడ‌ట త్రివిక్ర‌మ్‌. బ‌న్నీ కూడా విక్ర‌మ్‌తో చేయాల్సిన స‌నిమాను ప‌క్క‌న‌పెట్టి త్రివిక్ర‌మ్‌తో చేయాల్సిన ప్రాజెక్టును వీలైనంత తొంద‌ర‌గా ప‌ట్టాలెక్కించాల‌నుకుంటున్నాడ‌ట‌. డిసెంబ‌ర్‌లో ప్రారంభించి వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట వీరిద్ద‌రూ.