//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్రివిక్రమ్ తరువాత మూవీ మెగా హీరోతో

Category : movies

త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో కలిసి రూపొందించిన సినిమా అరవింద సమేత,, బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించారు. ఇప్పుడు అరవింద సమేత సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ తుదిపరి చిత్రం ఆ మెగా హీరోతోనే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వరుస ప్లాపులతో సంతమవుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా అంటూ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త వైరల్ అవుతుంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తరువాత అల్లు అర్జున్ తన తరువాత సినిమాను ప్రకటించలేదు. పెద్ద హీరోలు వారి వారి సినిమాలో బిజీలో ఉన్నారు. ఇప్పుడు ఖాళీగా ఉంది బన్నీ మాత్రమే. దీంతో త్రివిక్రమ్ దృష్టంతా బన్నీపైనే ఉందని టాక్. ‘అరవింద సమేత’ మంచి సక్సెస్ టాక్‌తో ముందుకెళుతోంది కాబట్టి ఇక బన్నీ కూడా త్రివిక్రమ్ వైపే మొగ్గు చూసే అవకాశం ఎక్కువగా ఉందని వినిపిస్తుంది.