Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ సినిమాకు నిర్మాతగా కళ్యాణ్

Category : movies

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత వీర రాఘవ. రాయలసీమ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసే అవాకాశం ఉంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ చేసే సినిమా దాదాపుగా ఖరారైపోయిందట. ఆ సినిమా ఎవరితో అంటారా..?న్యాచురల్ స్టార్ నానితో. ఎన్టీఆర్ తో సినిమా పూర్తి కాగానే తన తర్వాతి సినిమాను మొదలుపెట్టనున్నాడు.

అయితే ఆ సినిమాకు తొలిసారి నిర్మాతను మారుస్తున్నాడు త్రివిక్రమ్. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిసింది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ నుంచి ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోన్న ‘అరవింద సమేత... వీరరాఘవ’ వరకూ ప్రతి చిత్రానికి ‘హారిక హాసిని క్రియేషన్స్‌’ అధినేత సూర్యదేవర రాధాకృష్ణే (చినబాబు) నిర్మాత. ఇటీవల కాలంలో బయట నిర్మాణ సంస్థలో త్రివిక్రమ్‌ చేయబోయే చిత్రం ఇదే కావడం విశేషం.