Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరోసారి నందమూరి వారసుడితో

Category : movies

నందమూరి యువ హీరో NTR తో త్రివిక్రమ్ తెరకెక్కించిన తాజా చిత్రం "అరవింద సమేత". అక్టోబర్ 11 న ఈ సినిమాని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని త్రివిక్రమ్ ఎంతో కసితో తెరకెక్కించాడు. గత చిత్రం అజ్ఞాతవాసి ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు త్రివిక్రమ్. దీనికి తగ్గట్టే NTR తన నటనతో, డాన్స్ తో సరికొత్తగా రానున్నాడు. అయితే త్రివిక్రమ్ తరువాత మూవీపై టాలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ తరువాత మూవీ కూడా నందమూరి వారసుడితోనే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ తన వారసుడు మోక్షోజ్ఞ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ అరవింద సమేత మేకింగ్ వీడియో చూసిన తరువాత తన వారసుడు మోక్షోజ్ఞ డెబ్యూ ఫిలిమ్ ని త్రివిక్రమ్ తో చేయించాలని భావిస్తున్నాడంటా. అంతకముందు బోయపాటి అనుకున్న, త్రివిక్రమ్ అయితే మోక్షోజ్ఞ ని స్టైలీష్ గా చూపిస్తాడని ఉద్దేశ్యంతో బాలకృష్ణ ఒప్పుకున్నట్టు తాజా సమాచారం. అయితే ఈ చిత్రం పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలసిందే..

Related News