//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రెండ్ మారింది.. చిందు ఆడింది..!

Category : national

ప్రేమ పేరుతో ఎంతో మంది అబ్బాయిలు అమ్మాయిలు మోసపోతున్నారు.అబ్బాయిలు మోసపోయి, ప్రేమ విఫలం అయ్యి మందు కొడుతున్నారు.మరి అమ్మాయిలు మోసపోతే వాళ్ళ భావాలను బయటకి తెలుపలేక బాధపడుతున్న ఆడవాళ్లకు ఈమె ఒక నిదర్శనం.

ప్రేమ ఎంతటికైనా తెగించేలా చేస్తుంది.ఇది ఎవరు చెప్పారో ఎమో కానీ ఇప్పుడు ఈ విషయానికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ప్రేమ పేరుతో మోసం చేసిన తన ప్రియుడికి వినూత్నరీతిలో నిరసన తెలిపింది ఓ యువతీ.

ఏకంగా డీజేతో ప్రియుడి ఇంటి ముందు చిందేసింది.ఈ బాధతో ఆమె మద్యం సేవించినట్లు కనిపించినా ఈ విషయంపై స్పష్టత లేదు.అంతేకాదు ఆమిర్‌ఖాన్‌ ఫేమస్‌ మూవీ రాజా హిందూస్తాన్‌ లోని నాలుగు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ తన బాధను తెలియజేసింది.అయితే నెటిజన్లు మాత్రం ఆమె మనసు ఎంత గాయపడి ఉంటే అలా చేసి ఉంటుందని మద్దతు పలుకుతున్నారు.ఇది ఎక్కడ ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది.