//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

థేని కార్చిచ్చులో 9మంది ట్రెక్కర్లు మృతి..!

Category : state

తమిళనాడు లోని థేని లో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నైకి చెందిన ఓ ట్రెక్కింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 39 మంది, విద్యార్థుల బృందం పశ్చిమ కనుమల్లోని బోధికి చేరుకొని అక్కడనుండి శుక్రవారం ట్రెక్కింగ్ ప్రారంభించారు. వారు శనివారం కేరళవైపు అడవుల్లోకి చేరుకున్నారు. ఆదివారం కురంగణి అడవులలోకి ప్రవేశించారు.

ఆ అడవులలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం తో ట్రెక్కింగ్ కు అక్కడికి వెళ్లిన విద్యార్థులు ఆ మంటలలో చిక్కుకొని తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వ్యాపించిన మంటలను చూసిన విద్యార్థులు భయం తో పరుగులు తీశారు. గాలి వేగం ఎక్కువగా ఉండడం తో మంటలు తొందర గా మొత్తం వ్యాపించాయి.

ఇప్పటికి మంటలలో చిక్కుకొని 9 మంది చనిపోయారని సమాచారం. కొంతమందిని రక్షణ దళం కాపాడింది. కాపాడిన వారికీ కూడా సుమారు 80 శాతం మంటల ప్రభావం తో శరీరం కాలిపోయింది. ఇంకా కొంతమంది మంటలలోనే చిక్కుకొని వున్నారు.

అక్కడ నాలుగు హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తమిళనాడు సీఎం, డిప్యూటీ సీఎం అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.