//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైల్లో సీటు ఇవ్వనందుకు రూ. 75వేలు జరిమానా.

Category : national

రైల్లో టికెట్ రిజర్వు చేసుకున్న తర్వాత కూడా ఒకోసారి కొంతమంది వేరే ఎవరో అప్పటికే మన సీట్లో కూర్చుని ఉంటారు. మనం రిజర్వు చేసుకున్నామని చెప్పినా, ఏమాత్రం పట్టించుకోకుండా పాన్ మసాలా నములుతూ అవతల కూర్చోమని ఆర్డర్ వేస్తారు. ఇలా ఓ ప్రయాణికుడు ముందుగా రిజర్వ్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చుని, అతడి ప్రయాణం అసౌకర్యంగా సాగినందుకు రైల్వేశాఖకు వినియోగదారుల కమిషన్ రూ. 75వేల జరిమానా విధించింది. ఢిల్లీకి చెందిన వి.విజయ్ కుమార్ విశాఖపట్నం నుంచి ఢిల్లీ వచ్చేందుకు మే 30వ తేదీన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న కుమార్ లోయర్ బెర్తు రిజర్వు చేసుకున్నారు.

అయితే మధ్యప్రదేశ్‌లోని బీనా స్టేషన్‌లో వేరేవాళ్లు వచ్చి ఆయన సీట్లో కూర్చుండిపోయారు. అలా వచ్చినవాళ్లు తనతోపాటు ఇతర ప్రయాణికులకు కూడా అసౌకర్యం కలిగించారని, చాలా ఇబ్బందిగా ప్రవర్తించారని చెప్పారు. టీటీఈకి లేదా రైల్వేశాఖ అధికారులకు ఫిర్యాదు చేద్దామనుకున్నా, ఎవరూ కనిపించలేదని తెలిపారు. దీనికి రైల్వేశాఖ సరైన సమాధానం చెప్పలేకపోవడంతో సేవాలోపానికి గాను బాధితుడికి రూ. 75వేల పరిహారం చెల్లించాలని రైల్వేశాఖను ఫోరం ఆదేశించింది.ఈ మేరకు జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సమర్థించింది. ఈ పరిహారంలో మూడోవంతు మొత్తాన్ని టీసీ జీతం నుంచి కట్ చేయాలని, రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికుడికి సీటు ఇప్పించకుండా వదిలేసినందుకు అతడికి ఈ శిక్ష పడాలని తెలిపింది.