//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ మంత్రి ఇంట తీవ్ర విషాద ఛాయ‌లు..!

Category : politics

అస‌లే అధికార టీడీపీ నేత‌, పొలిట్‌బ్యూరో స‌భ్యుడు హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన ఘ‌ట‌న కేవ‌లం నంద‌మూరి అభిమానుల‌నే కాకుండా, టీడీపీ శ్రేణుల‌ను, యావ‌త్ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా క‌లిచి వేసింది. ఆ ఘ‌ట‌న నుంచి తేరుకోక ముందే టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఎంవీఎస్ మూర్తిని రోడ్డు ప్ర‌మాదం క‌బ‌ళించింది. అయితే, ఇద్ద‌రూ మృతి చెందిన ప్రాంతాలు వేరైనా.. ప్ర‌మాదం జ‌రిగిన తీరు మాత్రం ఒక్క‌టే.

హ‌రికృష్ణ న‌ల్గొండ జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెంద‌గా.. ఎంవీఎస్ మూర్తి అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. ఇలా ఈ రెండు ఘ‌ట‌న‌లో టీడీపీ శ్రేణులు పుట్టెడు దు:ఖ‌ంలో ఉండిపోయారు. ఇంకా ఆ రెండు ఘ‌ట‌న‌ల నుంచి తేరుకోనూ లేదు.

ఇలా ఒక ప‌క్క టీడీపీ నేతలు ఇద్ద‌రు మృతితో ఆ పార్టీ నేత‌లు కోలుకోలేని బాధ‌ను అనుభ‌విస్తుంటే..మ‌రో ప‌క్క ఏపీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణ ఇంట విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అత్త‌గారు లింగాల మాణిక్యాంబ (79) ఆదివారం మృతి చెందారు. దీంతో మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి ఇంట తీవ్ర విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ విష‌యం తెలుసుకున్నటీడీపీ నేత‌లు మాణ‌క్యాంబ మృతికి సంతాపం ప్ర‌క‌టించారు.

Related News