//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒక నిండు జీవితాన్ని బలితీసుకున్న అరవిందసమేత చిత్రం వివాదం ......!

Category : movies

అరవింద సమేత సినిమాలో రాయలసీమ భాషను, అక్కడి వారి జీవితాల్ని కించపరిచారని ఇటీవల హైదరాబాద్‌లో కొందరు యువకులు ప్రెస్‌మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరు ఓ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు మరో ఛానల్‌లో జరగనున్న చర్చా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. రాయల సీమ నుంచి హైదరాబాద్‌కు బయలు దేరారు. అయితే మార్గమధ్యంలో జరిగిన ఘోర ప్రమాదం ఒకరిని బలి తీసుకోగాముగ్గురు తీవ్ర గాయాలపాలై చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది .

జలం శ్రీను, సీమ కృష్ణానాయక్, రవికుమార్, రాజశేఖర్ రెడ్డిలు అరవింద సమేత సినిమాలో తమ భాషను, జీవితాల్ని కించపరిచారనే దానిపై జరగనున్న చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయలసీమ నుంచి హైదరాబాద్‌‌కు బయలుదేరినట్టు వీరి సన్నిహితుడు ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘వారి ప్రయాణం తుంగభద్రానదిని దాటి కొంత దూరం సాగింది.

ఇంతలో హఠాత్తుగా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరి వాహనం నుగ్గయింది. జలం శ్రీను అక్కడిక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన బహుజన ఉద్యమంతోపాటు సీమ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు అని ఫేస్‌బుక్ పోస్ట్ కథనం. దీంతో పాటు వారి ఫోటోలను కూడా ఎఫ్‌బీలో షేర్ చేశారు.