//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒక్క పిలుపుతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఉత్తమ్..

Category : politics

అధిష్టానం పిలుపుతో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. అత్యవసరంగా ఢిల్లీలోని వార్ రూంకు హాజరు కావాలని పిలుపువచ్చింది. దీనితో ఆయన హస్తినకు బయలుదేరారు. రాహుల్ ఏం చర్చిస్తారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలో మార్పులు...రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట ఇనుమడింప చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ పీసీసీలో అంతర్గత విబేధాలకు చెక్ పెట్టాలని రాహుల్ యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే కుంతియాకు సహాయకులుగా ఉండాలని మూడు రాష్ట్రాలకు చెందిన నేతలకు బాధ్యతలు అప్పచెప్పిన సంగతి తెలిసిందే.

ఇటీవలే రాహుల్ తో భేటీ అయిన నేతలు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పై ఫిర్యాదులు చేశారు. ఉత్తమ్ ఉంటే రాష్ట్రంలో 15 సీట్ల కంటే ఎక్కువ రావని నేతలు ఫిర్యాదు చేశారని సమాచారం. కానీ దీనిని ఉత్తమ్..అధిష్టానం ఖండించింది.

ఇదిలా ఉండగానే ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్ లో కీలక నేతల అయిన దానం నాగేందర్ రాజీనామా చేయడం..టీఆర్ ఎస్ లో చేరుతున్నారనే వార్త కలకలం సృష్టించింది. ఆయనతో పాటు ముఖేష్ గౌడ్ కూడా గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనితో రాహుల్ అత్యవసరంగా ఉత్తమ్ ని పిలుపించుకున్నారని తెలుస్తోంది. వీరి భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు వెలువడుతాయో చూడాలి.

Related News