//single page style gallary page

Top Heros Movies During Sankranti festival

Category : movies

Click here to read this article in Telugu

సంక్రాంతి 2020 బరిలో దిగుతున్న స్టార్లు..!

వచ్చే ఏడాది నిజంగానే సంక్రాంతి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ని తలపించేలా ఉంది. ప్రతి సంవత్సరం మొత్తం మీద సంక్రాంతే అతి పెద్ద సీజన్ కావడంతో పోటీని లెక్క చేయకుండా మరీ నిర్మాతలు కోట్లాది రూపాయల తమ పెట్టుబడిని పందెంగా పెడుతుంటారు. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా కానీ మినిమమ్ గ్యారెంటీ వసూళ్లు వస్తాయనే ధీమా వాళ్ళను ఇలా కవ్విస్తోంది. అలానే వినయ విధేయ రామ కూడా అంత డిజాస్టర్ అయినప్పటికీ 60 కోట్లకు పైగా వసూళ్లు రావడంలో అంతరార్థం అదే. గడిచిపోయిన 2019కు వచ్చే సంక్రాంతి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనే స్థాయిలో స్టార్ల కోడి పందేలకు రెడీ అవుతోంది. ఇప్పటికి అయితే రెండు మూడు కన్ఫర్మ్ గా వస్తాయని తెలుస్తున్నప్పటికీ ఆ సమయానికి చాలా మార్పులు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఈ రేస్ లో ఎలాంటి డౌట్లు రేపకుండా పక్కా ప్లానింగ్ తో ఉంది. అనిల్ రావిపూడి - దిల్ రాజు కాంబినేషన్ కాబట్టి లేట్ కాకుండా జాగ్రత్త పడతారనే టాక్ నడుస్తోంది. ఇక అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న మూవీ కూడా సంక్రాంతి నే టార్గెట్ చేసుకుని ఆ మేరకు ప్రకటన ఇచ్చేశారు. శర్వానంద్ శ్రీకారం కూడా ఊహించని విధంగా రేస్ లోకి రావడం మరో ట్విస్ట్. ఇంత పోటీ ఉందని తెలిసినా ధైర్యంగా సిద్ధపడటం చూస్తే శ్రీకారం కూడా కంటెంట్ మాములుగా లేనట్టేగా మరి. రజనీకాంత్ దర్బార్ కూడా సై అంటోంది. అఫీషియల్ నోట్ రాలేదు కానీ ఇదీ ఫిక్స్ అయినట్టే. ఇక అసలు షూటింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి బాలకృష్ణ-రవికుమార్ సినిమా లేనట్టే. జనవరి 9 నుంచి జనవరి 15 దాకా పైన చెప్పినవి షెడ్యూల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకో నెల రెండు నెలల్లో డేట్లతో సహా ప్రకటనలు వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు పూర్తి క్లారిటీ ఉంటుంది.

Next year is really looking forward to the Wallpapers Twenty Twenty match. With Sankranti being the biggest season of the year, most producers bet their investments in the crores of rupees without counting the competition. Because no matter what the movie is, the minimum guarantee is charged to insurers. Similarly, Vinaya Vidya Rama is also a disaster, but the same is the problem of collecting over 60 crores. In the preceding 2019 to the equinox yet been resolved in any way beyond the level of the stars of chicken races being ready. Even though it seems likely that two to three will come to fruition by now, the possibility of much change by that time cannot be ruled out.

Mahesh Babu is not right. Anil Ravipudi - Dil Raju Combination Talk is going to be very carefree. The Allu Arjun-Trivikram combo is also being announced in the film, targeting Sankranti. Another twist is that Sharwanand Shrikaram also unexpectedly entered the race. If known, the bold assumption that such a competition launched by the content lenattega more generally. Rajinikanth Darbar is also a sign. No official note was received but this is the fix. Balakrishna-Ravikumar is not a movie as there is no original shooting . All the above seems to be scheduled for January 9 to January 15. There will be announcements including dates in another two months so there will be full Clarity.