ఐపీఎల్-10 లో కోల్‌కతా నైడ్రైడర్స్ విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో మంచి పామ్ లో ఉన్న కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ పరుగులు సాధిస్తూ విజయాల్లో కీరోల్ పోషిస్తున్నాడు. దీంతో ఈ సీజన్లో అత్యధికంగా 376 పరుగులు సాధించి ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ లో ముందున్నాడు. శుక్రవారం సాధించిన అర్ధశతకంతో, 35 అర్ధశతకాలతో ఐపీఎల్లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాడిగా గంభీర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్(34) ఉన్నాడు. ఇప్పటి వరకు గంభీర్ ఐపీఎల్లో 141మ్యాచ్‌ల ద్వారా 4,010పరుగులు సాధించాడు. ఇందులో 35అర్ధశతకాలు ఉన్నాయి. కాగా, మొత్తం టీ20 కెరీర్లో 229మ్యాచ్‌లాడిన గంభీర్ 6,023పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 51 అర్ధశతకాలు ఉన్నాయి.