//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సౌత్ ఇండియన్ ట్రైలర్స్

Category : movies

1) బాహుబలి 2

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి తరువాత అత్యధికి వ్యయం తో రూపొందిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం 650 కోట్ల కలెక్షన్స్ తో పాటు కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను కూడా తెచ్చిపెట్టింది. ఈ ప్రశ్న దేశం మొత్తం మారుమోగిపోయింది. దీంతో బాహుబలి 2 కి ఎనలేని క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి స్థానం లో వుంది.

2) రోబో 2.o

రోబో కి సీక్వెల్ గా వచ్చిన చిత్రం రోబో 2.o . సూపర్ స్టార్ రజిని , శంకర్ కాంబినేషన్ లో విజువల్ వండర్ గా రూపుదిద్దుకున్న చిత్రం రోబో 2.o . బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ ట్రైలర్ 24 గంటల్లో 21.2 మిలియన్ వ్యూస్ సాధించింది.

3) సర్కార్

తమిళ స్టార్ దళపతి విజయ్ , కోలీవుడ్ మాస్ డైరెక్టర్ మురగదాస్. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సర్కార్ ఇప్పుడు థియేటర్స్ లో దుమ్ము లేపోతుంది. తమిళ్ లో ఈ చిత్రం రకరకాల వివాదాల్లో కూడా చిక్కుకుంది.అయితే కోలీవుడ్ స్టార్స్ , మురగదాస్ కి సపోర్ట్ గ నిలిచారు. సర్కార్ ట్రైలర్ రిలీజ్ అయినా 24 గంటల్లో 15 మిలియన్ వ్యూస్ సాధించింది.

4) మెర్సల్

రాజా రాణి ఫేమ్ అట్లే దర్శకత్వం లో తేరి మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది.అట్లీ ,విజాయ్ కాంబినేషన్ తేరి తరువాత భారీ అంచనాలతో రూపొందిన చిత్రం మెర్సల్. తమిళ్, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ట్రైలర్ 11.21 వ్యూస్ సాధించింది.

5) అరవింద సామెత వీరరాఘవ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం అరవింద సామెత వీరరాఘవ. ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యధిక వ్యూస్ నమోదుచేసిన ట్రైలర్ గా నిలిచింది. ఈ మూవీ ట్రైలర్ 24 గంటల్లో 8 మిలియన్ వ్యూస్ సాధించి టాప్ అయిదు స్థానాల్లో చోటు దక్కించుకుంది.