//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక షేర్ సాధించిన టాప్ - 10 చిత్రాలివే..!

Category : movies

అర‌వింద స‌మేత చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ అద్దిరిపోయే రేంజ్‌లో జ‌రుగుతుండ‌టంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్‌ను సాధిస్తుంది అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఒక‌సారి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక షేర్లు సాధించిన టాప్ - 10 సినిమాల‌ను ఒక‌సారి గ‌మ‌నిస్తే

టాప్ 1లో బాహుబ‌లి పార్ట్ 2 ఆల్‌మోస్ట్ 43 కోట్ల షేర్‌తో ఉండ‌గా, రెండో ప్లేస్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి 26.4 కోట్ల షేర్‌తో టాప్ -2లో కొన‌సాగుతుంది. ఇక మూడో ప్లేస్‌లో మ‌హేష్‌బాబు న‌టించిన భ‌ర‌త అనే నేను సినిమా 23.52 కోట్ల షేర్‌తో టాప్ 3 కొన‌సాగుతుంది.

టాప్ 4లో మెగాస్టార్ చిరంజీవి క‌మ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం.150 రూ.23.25 కోట్ల షేర్‌తో నాలుగో స్థానంలో ఉంది.

ఇక టాప్ 5లో బాహుబలి పార్ట్ 1 22.5 కోట్ల షేర్‌తో, టాప్ -6లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు 22.27 కోట్ల షేర్‌, టాప్ 7లో ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ కుశ సినిమా 21.81 కోట్ల షేర్‌, టాప్ 8 లో స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ 20.29 కోట్ల షేర్‌తో, టాప్ 9లో ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ 20.5 కోట్ల షేర్‌తో, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం సినిమా19.7 కోట్ల షేర్‌తో టాప్ 10లో చోటు ద‌క్కించుకుంది.

ఓవ‌రాల్‌గా ప్ర‌స్తుతానికి టాప్ -10లో నిలిచిన సినిమాలు ఇవే. బాక్సాఫీసు వ‌ద్ద ఇప్పుడు భారీ ఎత్తున రిలీజ‌వుతున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా ఈ లిస్టులో ఏ ప్లేస్‌లో నిలుస్తుంద‌ని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియ‌జేయండి.