అమెరికా అమ్ములపొదిలో ఉన్న 'తోమ్ హక్' క్షిపణులు అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించడంలో పేరు గాంచాయి. అందుకే అమెరికా నిర్దిష్టమైన లక్ష్యాలపై బీభత్సంగా దాడి చేయాలనుకున్నపుడు ఈ క్షిపణులను తన అమ్ములపొదిలోంచి తీస్తుంది. ఇది ఎంత ఖచ్చితమంటే 1500 నుంచి 2500 కి.మీ దూరం నుంచి విడిచినా సరే లక్ష్యాలను కూడా గురి తప్పకుండా ఇవి చేధించగలవు.'రేథన్ సిస్టమ్స్' కంపెనీ ప్రోడక్ట్ అయిన 'తోమ్ హక్' క్షిపణులు మొదటిసారి 1984 లో అమెరికా సైన్యంలో ప్రవేశపెట్టిన నాట నుంచి అవి మరింత టెక్నాలజీతో అభివృద్ధి చెంది అమెరికా గగన తల యుద్ధరంగంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 1991 లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో అమెరికా ఈ క్షిపణులనే ప్రయోగిస్తోంది. గంటకు 880 కి.మీ వేగంతో 2500 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను సాదించగల ఈ క్షిపణులు పైలెట్లు అత్యంత దూరం నుంచే విడిచే సౌలభ్యం ఉడటం ఆ క్షిపణిలోని ప్రత్యేకత. ఒక్కో క్షిపణి ఖరీదు దాదాపు 6 లక్షల డాలర్లు.