//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ సెక్స్ రాకెట్....హీరోయిన్స్ పై ఫైర్ అయిన తమ్మారెడ్డి...!

Category : movies

టాలీవుడ్ సెక్స్ రాకెట్ అంశం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. చికాగోలో టాలీవుడ్ హీరోయిన్ల వ్యభిచారం బట్టబయలైన తరువాత ఈ అంశం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడారు.

ఈ వ్యవహారంలో ఇరుక్కుని ఇండస్ట్రీ పరువుతీస్తున్న హీరోయిన్స్ పై ఆయన నిప్పులు చెరిగారు. హీరోయిన్స్ వారి సొంత నిర్ణయాలతో అమెరికా ఈవెంట్స్ కు వెళుతుండడం వలనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తమ్మారెడ్డి అన్నారు.

ఇటీవల అమెరికాలో బట్టబయలైన సెక్స్ రాకెట్ విషయంలో ఎవరిని అడిగినా ఆ హీరోయిన్ ఉంది, ఈ హీరోయిన్ ఉంది అని పేర్లు కూడా చెబుతున్నారు. నాలుగైదేళ్ల నుంచి అమెరికాకు వెళుతున్న హీరోయిన్స్ పేర్లన్నీ చెబుతున్నారని తమ్మారెడ్డి అన్నారు.

ఇండస్ట్రీలో లేనివారిని కూడా హీరోయిన్సే అని చెప్పేస్తున్నారు. సమస్య మొత్తం హీరోయిన్లు సొంత నిర్ణయాలతో అమెరికాకు వెల్ళడం వలనే అని తమ్మారెడ్డి అన్నారు. మా అసోసియేషన్ తో మాట్లాడి ఎందుకు వెళ్లడం లేదు అని ప్రశ్నించారు.

హీరోయిన్లు ఇలాంటి పిచ్చి పనులు చేయడం వలనే వాళ్ళ పరువుతోపాటు ఇండస్ట్రీ పరువు కూడా తీస్తున్నారని విమర్శించారు. ఇండస్ట్రీ ఇలా మాటలు పడాల్సిరావడానికి కారణం కోఆర్డినేటర్లు కూడా అని తమ్మారెడ్డి దుయ్యబట్టారు. వారు చేస్తున్న ఛండాలపు పనుల వలన పెద్ద వివాదం జరుగుతోంది. కోఆర్డినేటర్లు పద్దతిగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని తమ్మారెడ్డి హెచ్చరించారు.