Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫోర్బ్స్ జాబితాలో మన తెలుగు తారల సందడి

Category : movies

ప్రతి ఏడాది సెలబ్రిటీస్ కు సంబంచిన సంపాదనను విడుదల చేస్తుంది ఫోర్బ్స్ ఇండియా. ఈ ఏడాది కూడా 2017 అక్టోబర్ నుండి 2018 సెప్టెంబర్ వరకు మన దేశం లో అత్యధికంగా ఆర్జించిన 100 మంది జాబితాను ను విడుదల చేసింది ఫోర్బ్స్ ఇండియా.

ఈ జాబితాలో బాలీవుడ్ నటులతో పాటు మన టాలీవుడ్ ప్రముఖులు కూడా చోటు దక్కించుకోవడం విశేషం. 253.25 కోట్ల సంపాదనతో సల్మాన్ ఖాన్ ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. సల్మాన్ ఖాన్ వరసగా మూడవ సారి అగ్రస్థానములో నిలవడం విశేషం.

ఇక మన తెలుగు స్టార్స్ కూడా మొదటి 100 స్థానాల్లో చోటు దక్కించుకుని సత్తా చాటారు. 31.33 కోట్లతో పవన్ కళ్యాణ్ 24 వ స్థానంలో ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - 28 కోట్లు , మహేష్ బాబు - 24.33 కోట్లు , నాగార్జున 22.25 కోట్లు , అల్లు అర్జున్ - 15.67 కోట్లు , రామ్ చరణ్ - 14 కోట్లు , విజయ్ దేవరకొండ - 14 కోట్లు తో మన టాలీవుడ్ కథానాయకులు సందడి చేసారు. అతి తక్కువ సమయంలోనే విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించడం మాములు విషయం కాదు. వచ్చే ఏడాది మరింత ముందుకు దూసుకుపోతాడని ట్రేడ్ పండితులు అంఛనా వేస్తున్నారు.

Related News